నర్సీపట్నం : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లి కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మర్యాద పూర్వకంగా కలిసారు. నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు గణేష్ తెలిపారు.
తుమ్మపాల: జడ్పీ వైస్ చైర్‌పర్సన్ భీశెట్టి సత్యవతి, ఆమె కుమారుడు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకుడు భీశెట్టి జగన్ తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు. దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై ఆయనతో చర్చించినట్లు తెలిపారు. జిల్లాలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.


