నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో సృష్టి క్షేత్రం పేరుతో చేస్తున్న అక్రమ నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. కోర్టు అదేశాలను అమలు చేయాల్సిన అధికార యంత్రాగం కనీసం పట్టించుకోలేదు. స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడి ఆధ్వర్యంలో చేపట్టిన సృష్టి క్షేత్రం అక్రమ నిర్మాణాలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హైకోర్టును ఆశ్రయించారు. పెద్ద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ఈ పిల్‌పై ప్రతివాదులుగా ఉన్న జలవనరులు, కలెక్టర్‌తో పాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చి 24 గంటలు గడుస్తున్నా ఇరిగేషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చెరువు మధ్యలో వేస్తున్న రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్న మిషనరీ ఇంకా అక్కడే ఉంది. ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు వెనకాడుతున్న ఇరిగేషన్ అధికారుల వైఖరిని కోర్టు దృష్టికి తీసుకువెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధమవుతున్నట్టు తెలిసింది.


