8న ‘అనకాపల్లి’ సినిమా రిలీజ్‌ | - | Sakshi
Sakshi News home page

8న ‘అనకాపల్లి’ సినిమా రిలీజ్‌

Apr 3 2026 7:56 AM | Updated on Apr 3 2026 7:56 AM

● దర్శకుడు నక్కిన త్రినాథ్‌

అనకాపల్లి: అనకాపల్లి సినిమాను ఈనెల 8న దేశవ్యాప్తంగా విడుదల చేయడం జరుగుతుందని సినీదర్శకుడు నక్కిన త్రినాథ్‌ అన్నారు. స్థానిక ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘అనకాపల్లి’ సినిమాను అనకాపల్లి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరిగిందన్నారు. అనకాపల్లిపై ఉన్న అభిమానంతో సినిమాను తీయడం జరిగిందని, ఇక్కడ ప్రజలు ఎక్కువగా సినిమాన్ని ఆదరించడమే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని పదర్శించి, అనకాపల్లి పేరును చాటడం జరుగుతుందన్నారు. విక్రమ్‌ సహదేవ్‌ హీరోగా సంధ్య వశిష్ట హీరోయిన్‌గా తారక్‌ కొండప్ప విలన్‌గా నటించడం జరిగిందన్నారు. అంతకుముందు సంధ్య వశిష్ట, తారక్‌ కొండప్పలు సినిమా షూటింగ్‌లో వారి అనుభవాలను వివరించారు. కార్యక్రమంలో భవ్యశ్రీ డెవలపర్‌ అధినేత, గవరపాలెం కనకదుర్గమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్‌ కాండ్రేగుల శ్రీరామ్‌, ఆలయ వ్యవస్థాపకుడు పి.వి.రమణ, సహనిర్మాత కుమార్‌రాజా, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్‌ కొణతాల మురళీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement