సేవలు కొనసాగించాలి
కూటమి ప్రభుత్వం కొలువుదీరక రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సేవలు సరిగా అందడం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పథకాలను మాత్రం యథాతథంగా కొనసాగించాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ ఏడాది నేను మూడెకరాల్లో వరి సాగు చేశాను. రూ.60 వేలు పెట్టుబడి పెట్టాను. నష్టమే తప్ప లాభం రాలేదు. ఒక మడి అమ్మితే గానీ వ్యవసాయం చేయలేని పరిస్థితిలో రైతు ఉన్నాడు. అరకొర పెట్టుబడి సాయం..సకాలంలో విత్తనాలు లేకపోవడం..ఎరువులు అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం.
– కరణం జగ్గారావు, రైతు, మార్టూరు


