అధికారుల చుట్టూ తిరుగుతున్నా..
గత ప్రభుత్వంలో రైతు వద్దకే రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలందేవి. ఇప్పుడు అధికారులు చుట్టూ తిరుగుతున్నా సేవలందడం లేదు. గత ఖరీఫ్ సీజన్‌లో గంటల తరబడి క్యూలో నిలుచున్నా.. ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వని పరిస్థితులున్నాయి. రెండు మూడు రైతు సేవాకేంద్రాలను కలిపి ఒకటిగా చేశారు. ఈ కేంద్రాల్లో సేవలు సక్రమంగా అందడం లేదు. క్షేత్రస్థాయిలో సాగుకు అవసర మైన అన్ని రకాల సేవలందించే రైతు భరోసా కేంద్రాల పట్ల కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదు.
– ఒమ్మి మధు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, అనకాపల్లి


