టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
సమావేశంలో మాట్లాడుతున్న
డీఈవో గిడ్డి అప్పారావునాయుడు
అనకాపల్లి: పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. స్థానిక మెయిన్‌రోడ్డు జీవీఎంసీ పెద్ద హైస్కూల్‌ల్లో ఉపాధ్యాయులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను పక్కాగా అమలు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. ప్రైమరీ స్కూల్ కి సంబంధించి జీఎఫ్‌ఎల్‌ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌ను అన్ని పాఠశాలలో అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేవిధంగా ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే కృషి చేయాలని ఆదేశించారు. విద్యార్థులు మధ్యలో డ్రాప్ అవుట్ కాకుండా చూసుకోవలసిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్‌ఎం బ్రహ్మాజీ, ఆర్పీ గోవిందరావు,సీఆర్‌పీ నీలవేణి పాల్గొన్నారు.


