లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు
● రైల్వే స్టేషన్‌లో అధిక ధరలకు
విక్రయిస్తున్నట్టు గుర్తింపు
రైల్వేస్టేషన్‌లో తినుబండారాల షాపు
నిర్వాహకుడిని విచారిస్తున్న లీగల్ మెట్రాలజీ అధికారి రామచంద్రయ్య
అనకాపల్లి టౌన్: స్థానిక రైల్వేస్టేషన్‌లో తినుబండారాలు అమ్మే నాలుగు క్యాంటీన్‌లలో శుక్రవారం లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జాతీయ వినియోగదారుల వారోత్సవాలలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ బి.రామచంద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిస్కెట్ ప్యాకెట్లు, డ్రింక్స్‌ను ఎమ్మార్పీ కన్నా అధికంగా విక్రయిస్తున్నారన్నారని తెలిపారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న తినుబండారాల షాపులను తనిఖీ చేసి వినియోగదారుల హక్కులపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు బి.రామచంద్రరావు, వి.రామారావు, అనురాధ పాల్గొన్నారు.


