గుర్రాజుపేట విద్యార్థికి ఐఈఎస్‌లో 128 ర్యాంకు
గొంప నవీన్
ఎస్.రాయవరం: మండలంలో గుర్రాజుపేటకు చెందిన గొంప నవీన్ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్–2025) ఫలితాల్లో 128 ర్యాంక్ సాధించాడు. గొంప బాబూరావు, మంగతాయారుల రెండవ కుమారుడైన నవీన్ అడ్డురోడ్డు విశ్వశాంతి ప్రైవేటు స్కూల్‌లో 10 వ తరగతి వరకు చదివి పదికి 10 పాయింట్లు సాధించాడు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఏపీఆర్‌జేసీలో ఇంటర్మీడియెట్, కేరళ రాష్ట్రం కాలికట్ ఎన్‌ఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. గేట్‌లో ఆల్‌ఇండియా ర్యాంక్ 186 సాధించాడు. నవీన్ తండ్రి రైతు, తల్లి టైలర్, అన్న గొంప నాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నవీన్ ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యులు,గ్రామస్తులు అభినందనలు తెలిపారు.


