పార్సిళ్ల సేవల ద్వారా రూ.2.08 కోట్ల ఆదాయం
మాట్లాడుతున్న జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి ప్రవీణ
అనకాపల్లి: ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ) పార్సిల్ డోర్ డెలివరీ సేవల ద్వారా జిల్లాలో 2024–25 సంవత్సరానికి రూ.2.08 కోట్ల ఆదాయం లభించినట్టు జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి వి.ప్రవీణ తెలిపారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సిల్ కార్యాలయం వద్ద 50 కిలోల డోర్‌డెలివరీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులు పార్సిల్ బుకింగ్‌తో పాటు డోర్ డెలివరీ చార్జీలు చెల్లించినట్టయితే పార్సిల్ కౌంటర్ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ సదుపాయం పొందవచ్చన్నారు. పార్సిల్ సర్వీస్ ద్వారా 2022–23 ఏడాదిలో రూ.1.59 కోట్లు, 2023–24లో రూ.2.05 కోట్ల ఆదాయం వచ్చినట్టు చెప్పారు. మరిన్ని వివరాలకు 63024 46142, 73829 18492, 99592 25595 అనే నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.


