డ్రంకన్ డ్రైవ్ కేసులో జరిమానా
డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారు
నక్కపల్లి: ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి యలమంచిలి కోర్టు జరిమానా విధించిందని ఎస్‌ఐ సన్నిబాబు గురువారం తెలిపారు. ఇటీవల జాతీయ రహదారిపై నిర్వహించిన దాడుల్లో మద్యం సేవించి వాహనం నడిపిన వారుతోపాటు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 12 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. కోర్టు వారు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారన్నారు. ఒకరికి వారం రోజులు జైలు శిక్ష విధించారన్నారు.


