సింహాచలం వరకు డబుల్ డెక్కర్ బస్సు
సింహాచలంలో డబుల్ డెక్కర్ బస్సు
సింహాచలం: నగరంలో బీచ్‌రోడ్డుకే పరిమితమైన డబుల్ డక్కర్ ఎలక్ట్రిక్ బస్సు.. ఇక నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలంలో కూడా కనువిందు చేయనుంది. ఆ బస్సు సర్వీసును సింహాచలం వరకు పొడిగించారు. గురువారం బస్సు సింహాచలం చేరుకుంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు నగరంలో నుంచి సింహాచలం వచ్చే భక్తులకు, పర్యాటకులకు ఈ బస్సు కొత్త అనుభూతిని కలిగించనుంది. రోజుకి మూడు ట్రిప్పులు సింహాచలం వరకు బస్సు తిరుగుతుందని పర్యాటక సిబ్బంది తెలిపారు. కాగా టైమింగ్స్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. అలాగే సింహగిరి ఘాట్‌రోడ్డులో బస్సు వెళ్లేందుకు అనుకూలంగా లేకపోవడంతో కేవలం కొండదిగువ వరకు మాత్రమే వెళ్తుంది.


