 
															రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం
తుమ్మపాల: గుంటూరులో అండర్–17 విభాగంలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మార్టూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి గనిరెడ్డి తారక్ సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ మేరకు స్కూల్ కమిటీ చైర్మన్ సముద్రాలు, హెచ్‌ఎం విజయ సోమవారం అభినందించారు. మార్టూరు గ్రామానికి చెందిన తారక్ ఇక్కడ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తి మేరకు పోటీల్లో పాల్గొని విజయం సాధించాడని పీఈటీ ఎం. సూర్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
