
బల్క్‌డ్రగ్ పార్కును ఆపండి
మిగతా 8వ పేజీలో
● విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించండి
● వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం
మహారాణిపేట(విశాఖ): నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, దానిని నిలిపివేయాలని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూ రావు,పలువురు జెడ్పీటీసీలు డిమాండ్ చేశారు. శనివారం జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్కు వల్ల మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని, వారి ఆందోళనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నియోజకవర్గంలో తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల ను సేవ చేశానని గుర్తు చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ రాష్ట్ర ప్రజల జీవనాడి అని, దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తాను ఈ అంశా న్ని ఇప్పటికే మూడుసార్లు రాజ్యసభలో ప్రస్తావించానని, కేంద్ర ఉక్కు మంత్రి కూడా తనకు లేఖ రాశారని గుర్తుచేశారు. కేంద్రం ప్రస్తుతం సీఎం చంద్రబాబు మద్దతుపై ఆధారపడి ఉన్నందున, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ఎంపీ డిమాండ్ చేశారు. జెడ్పీటీసీలు దొండా రాంబాబు, పైల సన్యాసిరాజు, పెంటకోట స్వామి సత్యనారాయణ తొలుత స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా బాబూరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైర్‌పర్సన్ సుభద్ర ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సభ్యులు బల్లలు చరిచి మద్దతు తెలిపారు. సమావేశంలో పలు ఇతర కీలక అంశాలపై కూడా తీర్మానాలు చేశారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలోకి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలకు గత ముఖ్యమంత్రి