
విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ధర్నా
కోర్టు వద్ద ధర్నా చేస్తున్న న్యాయవాదులు
అనకాపల్లి: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఎదుట శుక్రవారం న్యాయవాదులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. స్థానిక కోర్టులో సమస్యలను పరిష్కరించాలని, మహిళలకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని, అనకాపల్లి కోర్టుకు పర్మినెంట్ భవనాన్ని నిర్మించాలని తదితర డిమాండ్లతో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో అనకాపల్లి బార్ అధ్యక్షుడు పిల్లా హరశ్రీనివాసరావు, కార్యదర్శి బంధం రమణ, సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.