
ప్రాణాలైనా ఇస్తాం
గ్రామంలో భూములు బలవంతంగా తీసేసుకుంటే ఎక్కడకెళ్లి బతకాలి. అభివృద్ధి చేస్తామంటున్నారు. తీసుకున్న భూముల్లో ఎలాంటి ప్రగతి లేదు. రోడ్డు కోసం గ్రామంలో 40 ఎకరాలు ఇచ్చాం. అలా అని మిగిలిన భూములు తీసుకుంటే ఒప్పుకునేది లేదు. ప్రాణాలు ఇచ్చయినా భూములు కాపాడుకుంటాం.
–పోతంశెట్టి రాజేష్, సర్పంచ్
ప్రభుత్వమా.. రియల్ ఎస్టేట్ వ్యాపారా?
రైతుల నుంచి బలవంతంతగా భూములు తీసుకుని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. అభివృద్ధి చేస్తామని మోసం చేస్తోంది. పంట భూములను తీసుకుని రైతులను బికారులను చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతులకు అండగా ఉంటాం. భూములను కాపాడుకుంటాం.
–వీసం రామకృష్ణ, ఎం అప్పలరాజు,
అఖిలపక్ష నాయకులు
ఆక్రమించాలని సూత్తన్నారు..
భూములన్ని తీసుకుని మమ్మల్ని ఏం సేద్దామనుకుంటున్నారు. రోడ్డు కోసం కొన్ని భూములు తీసేసుకున్నారు. ఇప్పుడు ఊరిని ఆనుకుని ఉన్న భూములన్నీ తీసేసుకోవాలని సూత్తన్నారు. తరతరాలుగా ఇవే భూములను నమ్ముకుని బతుకుతున్నాం. పేణాలయినా ఇత్తాం గానీ భూములు మాత్రం వదలం.
–పినపోతుల వెంకలక్ష్మి, కట్టా సీత, రైతులు, కాగిత
●

ప్రాణాలైనా ఇస్తాం

ప్రాణాలైనా ఇస్తాం