
కాస్తంత ఊరట
తేలికపాటి వర్షంతో
● చోడవరంలో 40.6 మి.మీ. అత్యధిక వర్షపాతం
కె.కోటపాడులో జలమయమయిన రహదారి
తుమ్మపాల: నిన్నటి వరకు తీవ్ర ఎండలతో బెంబేలెత్తించిన వాతావరణం శనివారం కాస్త చల్లబడింది. జిల్లాలో పలుచోట్ల తెల్లవారు నుంచి మధ్యాహ్నం వరకు తేలికపాటి వర్షం కురిసింది. కొన్ని రోజులుగా కాస్తున్న తీవ్ర ఎండలకు ఎక్కడ చినుకులు అక్కడే భూమిలో ఇంకిపోవడంతో లెక్కల్లో నమోదైన వర్ష ప్రభావం కనిపించలేదు. దాంతో నేల పొడిగానే దర్శనమిస్తోంది. అన్నదాతలకు నిరాశే మిగులుతోంది. జిల్లాలో శనివారం తెల్లవారు నుంచి మోస్తరు వర్షం కురిసింది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం 309 మిల్లీమీటర్ల వర్షం పడింది. అత్యధికంగా చోడవరం మండలంలో 40.6 మిల్లీమీటర్లు కాగా, అత్యల్పంగా మునగపాక మండలంలో 0.6 మిల్లీ మీటర్లు నమోదైంది.
వర్షపాతం వివరాలివీ..
చోడవరంలో 40.6 మి.మీ., మాకవరపాలెం 38.8, పాయకరావుపేట 38.6, నర్సీపట్నం 34.6, నాతవరం 24.2, బుచ్చెయ్యపేట 19.2 సబ్బవరం 18.8, కోటవురట్ల 18.6 – ఎస్.రాయవరం 17.4, పరవాడ 17, యలమంచిలి 9.8, కశింకోట 9.4 గొలుగొండ 8.8, అనకాపల్లి 6.4, రోలుగుంట 5.4 నక్కపల్లి 0.8 మునగపాకలో 0.6 మి.మీ.