
ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థికి అభినందన
సతీష్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి
మాడుగుల : మండలంలో కింతలి హైస్కూల్లో చదివిన పాసింబిల్లి సతీష్ ముంబై ఐఐటీలో సీటు సాధించాడు. దీంతో సతీష్‌తో పాటు తల్లిదండ్రులును, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురువారం దుశ్శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్, సర్పంచ్ మైచర్ల భవాణి, ఎంపీటీసీ నాయుడు, ఎంఈవో దేముడమ్మ, పుప్పాల రమేష్, ఉండూరు దేముడు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.