
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు
నక్కపల్లి: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది సదుపాయాలను కల్పిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం ఆమె నక్కపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేరెంట్స్, టీచర్స్‌తో సమావేశాలు నిర్వహిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థుల ప్రగతిని తెలియజేయడంతోపాటు వారి సమస్యలను తల్లిదండ్రుల ద్వారా తెలుసుకుని పరిష్కరించేందకు ఈ సమావేశాలు దోహదపడతాయన్నారు. సన్నబియ్యంతోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నట్టు చెప్పారు. గంజాయి వ్యాపారాలు చేస్తున్న వారికి సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నామన్నారు.
విద్యార్థుల విషయంలో బాధ్యతగా ఉండాలి
గొలుగొండ: విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చాలా బాధ్యతగా ఉండాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏఎల్‌పురం జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఇంటి వద్ద సెల్‌ఫోన్లు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును పూర్తిగా ఉపాధ్యాయులపై పెట్టకుండా తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, సర్పంచ్ లోచల సుజాత, నర్సీపట్నం జనసేన ఇన్‌చార్జి రాజాన సూర్యచంద్ర, మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ తారకవేణుగోపాల్, అడిగర్ల అప్పలనాయుడు, హెచ్‌ఎం కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
హోం మంత్రి అనిత
నక్కపల్లి జెడ్పీ పాఠశాలలో పీటీఎం

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు