
జనసేన నేత ఫ్లెక్సీ చించివేత
మునగపాక: మొన్న బీజేపీ–టీడీపీ, నిన్న టీడీపీలో గ్రూపుల గోల..కాగా నేడు జనసేనలోనూ వర్గపోరు బయటపడింది. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో మండల స్థాయిలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించడంతో వివాదం ముదురుతూ వస్తుంది. తాజాగా జనసేన మండల పార్టీ అధ్యక్షుడు టెక్కలి పరశురామ్ జన్మదినం సందర్భంగా స్థానిక బైపాస్ రోడ్డులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలో కొంతమంది ఫొటోలు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఉన్నాయంటూ ప్రచారం జరగడంతో పాటు శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సంబంధిత ఫ్లెక్సీని చించివేశారు. విషయం తెలుసుకున్న జనసేన మండల పార్టీ అధ్యక్షుడు టెక్కలి పరశురామ్ ఈ విషయమై మునగపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.