క్రైస్తవ వివాహాల లైసెన్స్‌ జారీ కర్తగా వెంకటరమణ | - | Sakshi
Sakshi News home page

క్రైస్తవ వివాహాల లైసెన్స్‌ జారీ కర్తగా వెంకటరమణ

Jun 24 2025 4:25 AM | Updated on Jun 24 2025 4:25 AM

క్రైస్తవ వివాహాల లైసెన్స్‌ జారీ కర్తగా వెంకటరమణ

క్రైస్తవ వివాహాల లైసెన్స్‌ జారీ కర్తగా వెంకటరమణ

దేవరాపల్లి: క్రైస్తవ వివాహాల నిర్వహణ, వివాహ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు లైసెన్స్‌ కర్తలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా నుంచి దేవరాపల్లిలోని దైవ స్వరూపి చర్చి పాస్టర్‌ పలివిలి వెంకటరమణ (నతానియేలు)కు క్రైస్తవ వివాహాల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు మైనార్టీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించింది. పది సంవత్సరాల పాటు వివాహ లైసెన్స్‌లు జారీ చేసేందుకు కాల పరిమితి విధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని పశ్చిమగోదావరి, అనంతపురం, కర్నూలు, ఏలూరు జిల్లాల నుంచి ఒక్కొక్కరికీ, గుంటూరు జిల్లా నుంచి ముగ్గురు పాస్టర్లకు క్రైస్తవ వివాహాల లైసెన్సుల జారీకర్తలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement