
ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న విదేశీ ప్రతినిధి
సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం : జీ20 దేశాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్(ఐడబ్ల్యూజీ) రెండో దశ సమావేశాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో పూణేలో నిర్వహించిన ఐడబ్ల్యూజీ సదస్సుకు కొనసాగింపుగా రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఈ సదస్సు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిరోజు సాయంత్రం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘అద్భుత నగరం విశాఖలో మీరు గడిపిన సమయం ప్రతి ఒక్క అతిథికి మధురానుభూతి మిగులుస్తుందని’ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అనంతరం జీ–20 దేశాల ప్రతినిధులతో పాటు వివిధ రంగాల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి గాలా డిన్నర్ పేరుతో ప్రత్యేక ఆతిథ్య విందుని ప్రారంభించారు. తరువాత 14 దేశాల ముఖ్యులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తొలిరోజు సదస్సుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆర్థిక నగరాల సుస్థిరత, స్థితిస్థాపకత అంశంపై తొలి సెషన్‌లో వివిధ దేశాల ప్రతినిధులు చర్చించారు. అనంతరం.. భవిష్యత్తులో ఆర్థిక నగరాలుగా అభివృద్ధి చెందనున్న దేశాల్లో రాబోతున్న మార్పులపై రెండో సెషన్‌లో చర్చించారు. ప్రపంచ బ్యాంకుకు సంబంధించి క్వాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్(క్యూఐఐ) సూచీలపై చివరి సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి అనే అంశంపై వివిధ దేశాల ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. ఈ సదస్సులో జీ–20 సభ్యదేశాల ప్రతినిధులు, 8 అతిథి దేశాలకు చెందిన ప్రతినిధులు, 10 అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
హాజరైన జీ20 దేశాల ప్రతినిధులు
విమానాశ్రయంలో అతిథులకు సంప్రదాయ స్వాగతం
తొలి రోజున మూడు అంశాలపై విస్తృతంగా చర్చలు
విదేశీ ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ సమావేశం
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

గాలా డిన్నర్‌లో పాల్గొన్న విదేశీ ప్రతినిధులు

సాంస్కృతిక కార్యక్రమాల్ని మొబైల్‌లో బంధిస్తున్న మంత్రి రోజా, విదేశీ ప్రతినిధులు
