కంచరపాలెం: కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌లో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి(టెక్నికల్) కె.సుధ తెలిపారు. డెక్కన్ ఫైన్ కెమికల్స్, సినర్జీస్ కాస్టింగ్స్ లిమిటెడ్, మ్యాక్స్ ఫాషన్స్ కంపెనీల్లో 580 ఖాళీల భర్తీకి జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ట్రైనీ కెమిస్ట్, ట్రైనీ ఆపరేటర్, క్యాషియర్, టెక్నీషియన్ హెల్పర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ డిప్లమో, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి 18–35 ఏళ్లు ఉన్న పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.ncs.gov.inలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఉపాఽధి కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి జరిగే జాబ్‌మేళాకు బయోడేటా, సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు.
పాత ఐటీఐ బాలికల క్యాంపస్‌లో..
జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరీయర్ సర్వీస్ సెంటర్ పాత ఐటీఐ బాలికల క్యాంపస్‌లో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా సబ్ రీజినల్ ఎంప్లాయిమెంట్(ఎస్సీ, ఎస్టీ) ఆధికారి నిట్టాల శ్యామ్ సుందర్ తెలిపారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, మెడిఫ్లస్‌కు సంబంధించి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో 100 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సేల్స్, ఆఫీసర్స్, హౌస్ ఎగ్జిక్యూటివ్స్, పార్మాసిస్ట్, డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి 22–40 ఏళ్ల వయసు కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గల వారు www.ncs.gov.inలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నేషనల్ కెరీయర్ సర్వీస్ సెంటర్‌లో బుధవారం ఉదయం 10 గంటల నుంచి జరిగే జాబ్‌మేళాకు హాజరు కావాలని కోరారు.