
సభలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్ చింతకాయల అనిత
బ్యాంకు చైర్‌పర్సన్ చింతకాయల అనిత
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అభివృద్ధికి పలు సంస్కరణలు చేపట్టామని ఆ బ్యాంకు చైర్‌పర్సన్ చింతకాయల అనిత అన్నారు. మంగళవారం మర్రిపాలెం వుడా లేఅవుట్‌లోని బ్యాంకు కార్యాలయంలో 57వ మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ వ్యవసాయ సహకార సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టిందన్నారు. పీఏసీఎస్, ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీ తీసుకొచ్చామన్నారు. తొలుత బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహక అధికారి డీవీఎస్ వర్మ వార్షిక ప్రగతి నివేదికను చదివి వినిపించారు. విశాఖ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించిన నేపథ్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ను మూడు జిల్లాల్లో కార్యకలాపాలు సాగించేందుకు బైలా సవరణ, జీఎం, ఏజీఎం, అంతర్ జిల్లా బదిలీలు తదితర అంశాలను మహాజన సభలో ఆమోదించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ రామచంద్రరాజు, బాంకు పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీ సభ్యులు, ఆప్కాబ్ డీజీఎం, నోడల్ అధికారి ఎం.అశ్వని, డీఆర్‌ఏఎస్‌డీ ఎం. హరిప్రసాద్, సహకార సంఘాల చైర్‌పర్సన్లు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.