చింతపల్లి: జాతీయ స్థాయి ఖేల్ ఇండియా కుస్తీ పోటీలకు స్థానిక డిగ్రీ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రం తరఫున ఎంపికయ్యారు. గత నెలలో న్యూఢిల్లీలో జరిగిన ఖేల్ ఇండియా క్రీడా పోటీల్లో కళాశాల నుంచి పాల్గొన్న బీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న బి.భార్గవి, కె.కేసియా ప్రతిభ కనబరిచారు. వీరికి ఆదివారం నుంచి ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందిందని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయ భారతి తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు తర్ఫీదునిచ్చిన పీడీ శివరాంను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.


