డుంబ్రిగుడ: మండలంలో పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఇన్‌చార్జీ ఎంపీడీవో విశ్వనాథ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛరథాన్ని వైస్ ఎంపీపీలు శెట్టి ఆనంద్‌రావు, లలిత అధికారుల సమక్షంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక వాహనం సమకూర్చిందన్నారు. ముందుగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఇనుము, ప్లాస్టిక్ వస్తువులు, అట్ట పెట్టెలు, తదితర సామాన్లు అందజేస్తే ధరను బట్టి గిరిజనులకు వస్తువులు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్డీ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.


