నాతవరం: పండగలు సందర్భంగా విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు కోరారు. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం నాతవరంలో అండర్ –14 విభాగంలో బాలబాలికలకు ఉమ్మడి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. బాలికల విభాగంలో గోపాలపట్నం హైస్కూల్ విద్యార్థినులు మొదటి స్థానంలో నిలిచారు. నాతవరం హైస్కూల్, శాంతినికేతన్ స్కూల్ విద్యార్థినులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. బాలుర విభాగంలో గోపాలపట్నం హైస్కూల్ విద్యార్థులు విజేతగా నిలిచారు. చోడవరం హైస్కూల్ ద్వితీయ, గొలుగొండ మండలం కృష్ణదేవిపేట స్కూల్ విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి బహుమతులతోపాటు షీల్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నాతవరం పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి అపిరెడ్డి మాణిక్యం, నాతవరం ఉప సర్పంచ్, వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటి సభ్యుడు కరక అప్పలరాజు, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, నేతల విజయకుమార్, వైఎస్సార్‌సీపీ మేధావుల సంఘం మండల శాఖ అధ్యక్షుడు పైల పోతురాజు పాల్గొన్నారు.


