జీవీఎంసీ అభివృద్ధిని బళ్లారి ప్రతినిధులకువివరిస్తున్న కమిషనర్ కేతన్‌గార్గ్
డాబాగార్డెన్స్: అధ్యయన యాత్రలో భాగంగా బళ్లారి మేయర్ పి.గాదెప్ప, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ జె.ఎస్. ఆంజనేయులు శుక్రవారం కమిషనర్ కేతన్ గార్గ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర సుందరీకరణ, అభివృద్ధి కార్యక్రమాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. విశాఖలో అమలవుతున్న ‘ఆపరేషన్ లంగ్స్’, 24 గంటల నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి ద్వారా ఆదాయం..వంటి అంశాలను కమిషనర్ వారికి వివరించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి ఐవీఆర్‌ఎస్, టోల్‌ఫ్రీ నంబర్ల పనితీరును తెలియజేశారు. జీవీఎంసీ కార్యాచరణ ఇతర నగరాలకు ఆదర్శంగా ఉందని మేయర్ గాదెప్ప కొనియాడారు. త్వరలోనే బళ్లారి నుంచి ఒక ప్రత్యేక సాంకేతిక బృందాన్ని అధ్యయనం కోసం విశాఖకు పంపిస్తామని, వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బళ్లారి టౌన్ ప్లానింగ్ అధికారి తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.


