● ఏప్రిల్ 2న ప్రజాభిప్రాయసేకరణ
● తహసీల్దార్ అన్నాజీరావు
గూడెంకొత్తవీధి: పర్యాటక రంగంలో సరికొత్త విప్లవానికి వేదిక కానున్న సీలేరు జలాశయం ’సీప్లేన్ ఏరోడ్రోమ్’ ప్రాజెక్టుపై ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏప్రిల్ 2వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు తహసీల్దార్ అన్నాజీరావు గురువారం వెల్లడించారు. ఏరోడ్రోమ్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని తహసీల్దార్ తెలిపారు. ప్రస్తుతం పర్యావరణ శాఖ నుంచి రావాల్సిన అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందని, అందులో భాగంగానే ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని వివరించారు. ఏప్రిల్ 2న జరిగే ఈ కీలక సమావేశానికి ఇన్‌చార్జి జేసీ స్వయంగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. సీలేరులో సీప్లేన్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


