రోడ్డెక్కిన కాఫీ రైతులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన కాఫీ రైతులు

Mar 27 2026 8:47 AM | Updated on Mar 27 2026 8:47 AM

కాఫీని జీసీసీ కొనుగోలు చేయాలని డిమాండ్‌

లేకుంటే ఐటీడీఏను ముట్టడిస్తామని హెచ్చరిక

చింతపల్లి: సీజన్‌కు ముందు దళారులను నమ్మవద్దని, గిట్టుబాటు ధర ఇచ్చి మేమే కొంటామని చెప్పిన జీసీసీ.. ఇప్పుడు తీరా సమయం వచ్చాక ముఖం చాటేయడం ఏంటి? అంటూ కాఫీ రైతులు, గిరిజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ గురువారం చింతపల్లిలో భారీ ఆందోళన చేపట్టారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో తొలుత చింతపల్లిలోని జీసీసీ డీఎం కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలిపారు. అనంతరం రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాఫీ గింజల కొనుగోలుపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేసిన అధికారులు, ఇప్పుడు అకస్మాత్తుగా కొనుగోళ్లు నిలిపివేయడం గిరిజన రైతులకు తీరని అన్యాయమని ధ్వజమెత్తారు.వెంటనే ఐటీడీఏ, జీసీసీ ఉన్నతాధికారులు స్పందించి కొనుగోళ్లు ప్రారంభించకపోతే, రైతులందరితో కలిసి పాడేరు ఐటీడీఏను ముట్టడిస్తామని హెచ్చరించారు. అవసరమైతే రోడ్లపైనే వంటా–వార్పూ చేపట్టి నిరసన తెలియజేస్తామన్నారు.తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను జీసీసీ డీఎం, తహసీల్దార్‌ శంకర్రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు చిరంజీవి పడాల్‌, సీపీఎం నాయకులు పాంగి ధనుంజయ్‌, ఎంపీటీసీ సత్తిబాబు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement