రావికమతం: మండలంలో చీమలపాడు పంచాయతీ జెడ్.జోగుంపేట కేంద్రంగా ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని గురువారం గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేతులు జోడించి నిరసన తెలిపారు. చీమలపాడు పంచాయితీ పరిదిలో గల జెడ్.జోగుంపేటలో ఎంపీపీ స్కూల్ ఉంది. జెడ్.జోగుంపేట గ్రామం చుట్టు కరగెడ్డ, గంగంపేట, రొచ్చుపణుకు,పెద గరువు, రాయపాడు, నేరెడు బంద, బంగారు బందలు, అజేయపురం తదితర గ్రామాల గిరిజన విద్యార్థులు జెడ్.జోగుంపేటలో చదువుకుంటున్నారు. రోలుగుంట, రావికమతం మండలాల పరిధిలో 70 గ్రామాల గిరిజన విద్యార్థులకు జెడ్.జోగుంపేట కేంద్రంగా గిరిజన పాఠశాల ఏర్పాటు చేయాలని చోడవరం నియోజవర్గంలో ఒక్క గిరిజన ఆశ్రమ పాఠశాల కూడా లేదని, ఆశ్రమ పాఠశాల ఉంటే గిరిజన విద్యార్థులకు మేలు జరుగుతుందని, జిల్లా కలెక్టర్ స్పందించి జెడ్.జోగుంపేటలో ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాంగి చంద్రయ్య,పాంగి చంపావతి,వంతల ఐలమ్మ పాల్గొన్నారు.


