దేవరాపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, అనకాపల్లి సమన్వయ కర్త మలసాల భరత్‌కుమార్ బుధవారం వేర్వేరుగా మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా నియమించినందుకు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు ముత్యాలనాయుడు చెప్పారు.


