సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి

Mar 26 2026 7:40 AM | Updated on Mar 26 2026 7:40 AM

● కేవీకే ప్రధాన శాస్త్రవేత్త రాజ్‌కుమార్‌

దేవరాపల్లి: ఆరోగ్యకరమైన పంటల సాగుకు రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ రాజ్‌కుమార్‌, శాస్త్రవేత్త డాక్టర్‌ సత్తిబాబు సూచించారు. మండలంలోని మారేపల్లిలో ఆత్మ పథకం సౌజన్యంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై స్థానిక వ్యవసాయ అధికారి ఎల్‌.వై.కాంతమ్మ ఆధ్వర్యంలో రైతులకు రెండో రోజు బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిందె దశలో ఉన్న నువ్వు పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు 13.0.45 మల్టీ–కె, 19.19.19 పిచికారి చేయాలని సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడాలని తెలిపారు. రైతులకు జీవామృతం తయారీ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తర్ణ అధికారి ఎస్‌. కిరణ్‌కుమార్‌ తదితర వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement