ముంచంగిపుట్టు : మండలంలో గల సుజనకోట మత్స్యగెడ్డలో ఈ నెల 26వ తేదీన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మాక్‌డ్రిల్ నిర్వహిస్తాయని ఎంపీడీవో ధర్మారావు,తహసీల్దార్ భాస్కరఅప్పారావు తెలిపారు. బుధవారం సుజనకోట, కొత్తసుజనకోట, కుమ్మరి పుట్టు గ్రామాల గుండా ప్రవహిస్తున్న మత్స్యగెడ్డను విజయవాడకు చెందిన 10వ బెటాలియన్ ఎన్‌డీఆర్‌ఎఫ్ కమాండెంట్ వీవీఎన్ ప్రసన్నతో కలిసి మండల స్థాయి అధికారులు పరిశీలించారు. స్థానిక గిరిజనులతో మాట్లాడారు. నాటు పడవలపై గెడ్డ దాటేటప్పుడు జరుగుతున్న ప్రమాదాల వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేశారు. మండలంలోని 23 పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, నేతలు,పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.సర్పంచ్ రమేష్, పాల్గొన్నారు.


