చిన్నారులకు సకాలంలో టీకాలు | - | Sakshi
Sakshi News home page

చిన్నారులకు సకాలంలో టీకాలు

Mar 26 2026 7:39 AM | Updated on Mar 26 2026 7:39 AM

జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి

పసుపులేటి నారాయణ

గూడెంకొత్తవీధి: చిన్నారులకు సకాలంలో టీకాలను వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి పసుపులేటి నారాయణ ఆదేశించారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పలు పీహెచ్‌సీల వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రాజేంద్రపాలెం, యూ.చీడిపాలెం, ఆర్‌వీనగర్‌, జీకేవీధి, సీలేరు, సప్పర్ల, దారకొండ పీహెచ్‌సీల సిబ్బంది హాజరయ్యారు. మాతృ, శిశుమరణాల నివారణ, వ్యాక్సినేషన్‌, హెల్త్‌కార్డులు, ఆర్‌సీహెచ్‌ పోర్టల్‌ నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈహెచ్‌ఆర్‌ నోడల్‌ అధికారి హరిప్రియ, పీహెచ్‌సీ వైద్యాధికారి రుషశ్రీ, డీపీహెచ్‌ఎన్‌వో భూలోకమ్మ, ఎంపీహెచ్‌ఈవో వెంకటేష్‌, హెచ్‌ఎస్‌లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement