● జిల్లా ఆహార భద్రత అధికారి గ్రీష్మ
జి.మాడుగుల: గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాల్లో వంట గదుల శుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలపై వార్డెన్లు, వంట సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఆహార భద్రతా అధికారి గ్రీష్మ, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీకే పరిమళ సూచించారు. బుధవారం స్థానిక ఏటీడబ్ల్యూవో కార్యాలయంలో మండలంలోని వసతి గృహాల వార్డెన్లు, వంట సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వసతి గృహాల్లో ఆహార పరిరక్షణ, వంట గదిలో పాటించవలసిన పరిశుభ్రత ప్రమా ణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని, వంట చేసేటప్పుడు వ్యక్తిగత శుభ్రతతో పాటు వంట గది పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూవో నాగ శిరీష, మినీ గురుకులం స్పె షల్ ఆఫీసర్ ఎం. విజయకుమారి, ఆశ్రమ పాఠశాలల వార్డెన్లు, వంట సిబ్బంది పాల్గొన్నారు.


