రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

Mar 25 2026 7:11 AM | Updated on Mar 25 2026 7:11 AM

మరో ఇద్దరికి స్వల్ప గాయాలు

కేజీహెచ్‌కు తరలింపు

కొయ్యూరు: మండలంలోని రామరాజుపాలెం వంతెన సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..శరభన్నపాలెంకు చెందిన ఉల్లి హరికృష్ణ, రవితేజతో కలిసి కృష్ణదేవిపేట నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. రామరాజుపాలెం వంతెన వద్దకు వచ్చేసరికి, నడింపాలెంకు చెందిన పాంగి బెన్నస్వామి నడుచుకుంటూ వెళ్తుండగా హరికృష్ణ బైక్‌ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బెన్నస్వామి కాలు విరిగింది. నియంత్రణ కోల్పోయి బైక్‌ పైనుంచి కింద పడటంతో హరికృష్ణకు తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. బైక్‌ వెనుక కూర్చున్న రవితేజకు స్వల్ప గాయాలయ్యాయి.క్షతగాత్రులను తొలుత నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే హరికృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement