చింతపల్లి: గూడెం కొత్తవీధి మండలం జెర్రెల ఘాట్‌రోడ్డులో సోమవారం రాత్రి అంబులెన్స్ బోల్తా పడి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జెర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మణిదీప్ అందించిన వివరాలిలా ఉన్నాయి.జెర్రల పీహెచ్‌సీ నుంచి లక్ష్మి అనే రోగిని చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకువస్తుండగా జెర్రల ఘాట్‌రోడ్డులో అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న లక్ష్మి, చిన్నారావు, సీతమ్మ, రూప తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరూ జెర్రల ప్రాంతంలో గల పలుగ్రామాలకు చెందిన వారని, వీరందరినీ చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు వైద్యాధికారి తెలిపారు.


