మండలి స్పీకర్‌ దృష్టికి కూటమి నేతల ఆగడాలు | - | Sakshi
Sakshi News home page

మండలి స్పీకర్‌ దృష్టికి కూటమి నేతల ఆగడాలు

Mar 24 2026 7:51 AM | Updated on Mar 24 2026 7:51 AM

చోడవరం : అధికార కూటమి నేతలు చేస్తున్న ఆగడాలను శాసనమండలి స్పీకర్‌ మోషన్‌రాజుకి మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ చోడవరం సమన్వయకర్త అమర్‌నాథ్‌ వివరించారు. వైఎస్సార్‌సీపీ పశ్చిమ గోదావరి జిల్లా ఇన్‌ఛార్జిగా ఇటీవల నియమితులైన అమర్‌నాఽథ్‌ ఆ జిల్లా పర్యటనలో భాగంగా భీమవరంలో శాసనమండలి స్పీకర్‌ మోషన్‌రాజును సోమవారం కలిశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, ఆగడాల గురించి స్పీకర్‌కు వివరించారు. శాసనమండలిలో ఈ విషయాలపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు అమర్‌నాఽథ్‌ తెలిపారు. ఆయనతోపాటు సోషల్‌మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, బీసీ సెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా నర్సింగరావు, వైస్‌ ఎంపీపీ బైన ఈశ్వరరావు, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు దొడ్డి వెంకట్రావు, ఓరుగంటి నెహ్రూ జిల్లా బీసీసెల్‌ ఉపాధ్యక్షుడు మొల్లి సోమునాయుడు, యూత్‌ జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్‌, మండల యూత్‌ అధ్యక్షుడు పల్లా ధనాజీ, బీసీసెల్‌ ప్రతినిధి పల్లా మోహన్‌కృష్ణ, నియోజకవర్గం స్టూడెంట్‌ విభాగం అధ్యక్షుడు బూరా బాలాజీ, తదితరులున్నారు.

మర్యాద పూర్వక కలయిక

పాయకరావుపేట: శాసనమండలి సభాపతి కొయ్యే మోషేన్‌రాజును వైఎస్సార్‌సీపీ నేతలు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోషేన్‌రాజును ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ గుడివాడ అమర్‌నాథ్‌, పెందుర్తి నియోజకవర్గ పరిశీలకుడు చిక్కాల రామారావు సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత పైల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement