ఉత్సాహంగా రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు

Mar 23 2026 8:26 AM | Updated on Mar 23 2026 8:26 AM

మాకవరపాలెం: మండలంలోని తామరంలో రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. దువ్వూరి బాలకృష్ణమూర్తి మెమోరియల్‌ పేరుతో ప్రగతి చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో తామరం ఇమ్మానుయేలు క్యాంపస్‌లో ఆదివారం 3వ రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు ఎంతో రసవత్తరంగా సాగాయి. ఈ పోటీల్లో అనకాపల్లి జిల్లాకు చెందిన బి.సాకేత్‌ ప్రథమ, విశాఖ జిల్లాకు చెందిన జె.నాగరాజు ద్వితీయ, అనకాపల్లి జిల్లాకు చెందిన ఎం.నూకరాజు తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నారు. వీరికి ప్రథమ బహుమతిగా రూ.8,000, ద్వితీయ రూ.5,000, తృతీయ రూ.4,000 నగదుతోపాటు మరో 30 మందికి ప్రోత్సాహక బహుమతులుగా రూ.60 వేలను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇమ్మానుయేలు సంస్థ డైరెక్టర్‌ బిషప్‌ కె.జీవన్‌రాయ్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ రిటైర్డ్‌ డీఈఈ చలపతిరావు, ప్రగతి చెస్‌ అకాడమీ వ్యవస్థాపకుడు సుధీర్‌, ఏపీటీఎఫ్‌ మండల అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి, గౌతమి లలిత కళా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకుడు రంగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement