వేసవిలో మంచు పలకరింపు | - | Sakshi
Sakshi News home page

వేసవిలో మంచు పలకరింపు

Mar 23 2026 8:25 AM | Updated on Mar 23 2026 8:25 AM

డుంబ్రిగుడ: సాధారణంగా మార్చి నెల వచ్చిందంటే భానుడి భగభగలు మొదలవ్వాలి. కానీ, మన్యం పర్యాటక ప్రాంతమైన డుంబ్రిగుడలో మాత్రం ప్రకృతి వింతగా స్పందించింది. గత పదిహేను రోజులుగా ఎండలు ముదురుతున్న తరుణంలో, ఆదివారం ఉదయం ఒక్కసారిగా కమ్మేసిన దట్టమైన పొగమంచు స్థానికులను ఆశ్చర్యపరిచింది.

కనిపించని రహదారులు.. వెలుగుల ప్రయాణం

ఆదివారం తెల్లవారుజాము నుంచి మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలను పొగమంచు దుప్పటిలా కప్పేసింది. దీని ప్రభావంతో అరకు – పాడేరు జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని రీతిలో మంచు కురవడంతో, డ్రైవర్లు హెడ్‌లైట్లు వేసుకుని అతి జాగ్రత్తగా ప్రయాణించారు.

చలికి వణికిన గిరిజనం

వేసవి కాలం ప్రారంభమైందని భావిస్తున్న తరుణంలో, ఈ అకాల పొగమంచుకు తోడు శీతల గాలులు వీయడంతో గిరిజనులు చలికి వణికిపోయారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు మళ్లీ స్వెట్టర్లు, రగ్గులు బయటకు తీశారు. వేసవిలో ఇలాంటి దట్టమైన మంచు కురవడం ఇక్కడి ప్రత్యేకతను చాటుతోందని పర్యాటకులు, స్థానికులు చర్చించుకుంటున్నారు.

డుంబ్రిగుడలో శీతల గాలులు

వాహనదారుల ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement