జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో సీలేరు పీడీ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో సీలేరు పీడీ ప్రతిభ

Mar 23 2026 8:25 AM | Updated on Mar 23 2026 8:25 AM

కాంస్య పతకం సాధన

సీలేరు: మహారాష్ట్రలోని పూణేలో ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగిన జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి కాంస్య పతకాన్ని కై వసం చేసుకుంది. ఈ జట్టు విజయంలో జిల్లాకు చెందిన గూడెం కొత్తవీధి మండలం సీలేరు జెడ్పీ హైస్కూల్‌ వ్యాయామ ఉపాధ్యాయుడు జి. చిన్ని కీలక పాత్ర పోషించారు. ఐదు నెలల క్రితం విజయవాడలో జరిగిన ఎంపిక పోటీల్లో తన ప్రతిభను చాటుకుని ఆల్‌ ఇండియా స్థాయి పోటీలకు ఆయన ఎంపికయ్యారు. ఇప్పుడు పూణేలో జరిగిన ప్రధాన పోటీల్లో అత్యంత ప్రతిభావంతమైన ఆటను ప్రదర్శించి జట్టు గెలుపునకు కృషి చేశారు. ఇటీవలే డీఎస్సీ ద్వారా వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఎంపికై న చిన్ని, విధుల్లో చేరిన కొద్ది కాలంలోనే జాతీయ స్థాయిలో పతకం సాధించి అరుదైన గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగభూషణం, తోటి ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement