డుంబ్రిగుడ: ఇక్కడికి సమీపంలోని ఒడిశా రాష్ట్ర చటువలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ సీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌లో కండ్రుమ్‌కు చెందిన హర్ష లెవెన్ క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది. రూ.70 వేల నగదు బహుమతితోపాటు కప్పును స్వాధీనం చేసుకుంది. వీటిని విజేత జట్టు సర్పంచ్ కె.హరి, వైస్‌ఎంపీపీ శెట్టి ఆనందరావు చేతులమీదుగా అందుకుంది. ఒడిశాకు చెందిన పాడువబంజోలాపుట్ జట్టు రన్నర్‌గా నిలిచింది. జట్టు సభ్యులకు రూ.50 వేల నగదు, కప్పును అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో గిరిజన యువత రాణించడం ఎంతో ప్రాముఖ్యమని అన్నారు. క్రీడల్లో నిమగ్నమవుతున్న యువతకు ప్రోత్సహించడంలో తమ వంతు కృషి చేస్తామని అన్నారు. కండ్రుమ్ జట్టు కెప్టెన్ శెట్టి సురేష్, వార్డు సభ్యుడు దాసు పాల్గొన్నారు.


