మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గతేడాది చేపట్టిన ఆపరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకుంది. చాలా మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మరణించారు. పలువురు స్వచ్ఛందంగా లొంగిపోయారు. నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించే పోలిట్ బ్యూరో నుంచి కేంద్ర కమిటీ నేతలు సైతం హతమయ్యారు. కగార్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ప్రజా భద్రత కోసం కేంద్రం తాజాగా ఆపరేషన్ వజ్ర ప్రహార్‌కు శ్రీకారం చుట్టింది.
కొయ్యూరు: ఆపరేషన్ కగార్‌తో నాలుగు దశాబ్దాల పాటు జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన మావోయిస్టుల సంఖ్య తగ్గిపోయింది. మన్యంలో తుపాకుల మోత, మందుపాతర్ల పేల్లుళ్లు, ఇన్‌ఫార్మర్ల నెపంతో గిరిజనులను హతమార్చడం వంటి ఘటనలు ప్ర స్తుతం ఆగిపో యాయి. అదే మూడు దశాబ్దాల వెనక్కి వెళ్తే గిరిజను లు నిత్యం భ యం నీడలో గడిపిన రోజులవి. రాత్రయితే ఎవరు ఎటువైపు నుంచి వచ్చి ఏమి చేస్తారో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. మావోయిస్టులకు ఆశ్రయమిస్తే పోలీసులతో సమస్యలు.. అలా అని మావోయిస్టుల మాట వినకుంటే ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మావోయిస్టులు రా(లే)క పోవడంతో మారుమూల గ్రామాల్లో గిరిజనులు సైతం సంతోషంగా జీవితాలు గడుపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
విస్తృతంగా కార్డెన్ సెర్చ్‌లు
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆపరేషన్ వజ్ర ప్రహార్‌కు పోలీసులు శ్రీకారం చుట్టారు. నేరస్తులను ముందుగానే గుర్తించడం, నేరం జరగకుండా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. అల్లూరి జిల్లాలో గడచిన కొద్ది రోజుల నుంచి పోలీసులు ఆపరేషన్ వజ్ర ప్రహార్‌ను అమల్లోకి తీసుకువ చ్చారు. జిల్లాలో గంజాయి రవాణా అతిపెద్ద సవాల్‌గా మారింది. దీనిని పూర్తిగా నిర్మూలన చేసేందుకు వీలుగా గ్రామాల్లో కార్డె న్ సెర్చ్ చేస్తు న్నారు. గంజాయిని పండించి, రవాణా చేసిన గిరిజన గ్రామాలపై పోలీసులు కొద్ది రోజులుగా కార్డెన్ సెర్చ్‌లు చేపట్టారు. ఒకే సారి గ్రామాన్ని నలువైపుల నుంచి చుట్టుముట్టి తనిఖీలు చేస్తున్నారు. బయట వ్యక్తు లు ఆ సమయంలో ఉంటే పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పదంగా ఉంటే విచారిస్తున్నారు. ఇక రికార్డులు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. దీని మూలంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నేరాలు చేయాలనుకునే వారు భయపడుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. బూదరాళ్ల పంచాయతీలో గరిమండ, కన్నవరం, అన్నవరం, మర్రివాడ పంచాయతీలో నిమ్మలగొందిలో కార్డెన్‌సెర్చ్‌లను నిర్వహించారు. గూడెం, చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు.
నాలుగు దశాబ్దాల పాటు గిరిజనుల భయానక జీవితం
ఈ నెలాఖరుతో ముగియనున్న
మావోయిస్టుల గడువు
తాజా ఆపరేషన్ వజ్ర ప్రహార్ ప్రారంభం


