సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Mar 22 2026 1:49 AM | Updated on Mar 22 2026 1:49 AM

నక్కపల్లి : ఈనెల 23న నక్కపల్లి మండలం తమ్మయ్యపేటలో జరిగే స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లతోపాటు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొనే బహిరంగ సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి శనివారం అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైజన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రూట్‌మ్యాప్‌, ట్రయల్‌రన్‌ హెలీప్యాడ్‌ నిర్మాణం, వీవీఐపిలు ప్రయాణించే రూట్లకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాటు చేసిన బందోబస్తు గురించి వివరించారు. బందోబస్తు కోసం వచ్చిన సిబ్బందికి తగు సూచనలు చేశారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లపై హోంమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ శాఖల మంత్రితోపాటు, కేంద్రమంత్రులు, రామ్మోహన్‌నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌ , హెచ్‌డి కుమార స్వామి గౌడ తదితరులు పాల్గొంటారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాన్య ప్రజల కోసం ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement