14 నుంచి ముత్యాలమ్మ జాతర | - | Sakshi
Sakshi News home page

14 నుంచి ముత్యాలమ్మ జాతర

Mar 21 2026 5:07 AM | Updated on Mar 21 2026 5:07 AM

ఉత్సవ కమిటీ ఏర్పాటు

చింతపల్లి: స్థానిక గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలను ఈ ఏడాది ఏప్రిల్‌ 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో గ్రామ పెద్దలు, వివిధ సంఘాల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పసుపులేటి వినాయకరావు, ప్రధాన కార్యదర్శిగా దురియా హేమంత్‌ కుమార్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా పెదరెడ్ల బేతాళుడు, సభ్యులుగా జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్‌ తదితరులు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ కోరాబు అనూషదేవి, వైఎస్సార్‌సీపీ నేతలు జల్లి సుదాకర్‌,బూసరి కృష్ణారావు,గంగన్న పడాల్‌, ముత్యాలమ్మ వారి అనువంశిక ధర్మకర్తలు, సుర్ల వంశీయులు అప్పారావు, వీరేంద్ర, మాదల తిరుపతిరావు, ఉద్యోగ సంఘ ప్రతినిధులు యూవీ గిరి, కుడుములు వెంకటరమణ, దేపూరి శశికుమార్‌, కిట్లంగి ప్రసాద్‌, వర్తక సంఘ ప్రతినిధులు తాటిపాకల నాగేశ్వరరావు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement