గొలుగొండ: దొంగతనం జరిగిన కొద్ది రోజుల్లో కేసును ఛేదించి, చోరీ సొత్తును రికవరీ చేసినట్టు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ తెలిపారు. వివరాలు... గొలుగొండ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రొంగల దేముడు ఇంటిలో ఈనెల 13న ఇంటిలో ఎవరూ లేని సమయంలో రెండున్నర తులాల బంగారం, వెండిపట్టీలు చోరీ జరిగాయి. బాధితుడు ఫిర్యాదు మేరకు గొలుగొండ ఎస్‌ఐ రామారావు, సిబ్బంది సభ్యులు విచారణ నిర్వహించారు. నిందితుడు ఓ బాలుడు(17)గా గుర్తించారు. ఈ బాలుడుపై చోడవరం, పరవాడ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులున్నాయని సీఐ తెలిపారు. బాలుడి నుంచి బంగారం, వెండి ఆభరణాలు రికవరీ చేసి, కోర్టుకు తరలించినట్లు చెప్పారు. ఈ కేసు తక్కువ సమయంలో ఛేదించిన ఎస్‌ఐ రామారావుతో పాటు సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రామారావు తదతరులు పాల్గొన్నారు.


