గంజాయి నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

గంజాయి నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

Mar 20 2026 8:16 AM | Updated on Mar 20 2026 8:16 AM

రూ. లక్ష జరిమానా

తుమ్మపాల/మాడుగుల రూరల్‌: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ అఽధికారి ఎం.సుధీర్‌ గురువారం మీడియాకు వివరాలను వెల్లడించారు. 2014 ఆగస్టు 18వ తేదీన తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ ప్రాంతానికి చెందిన మండా జీవన్‌(27) గంజాయి అక్రమ రవాణా చేస్తూ వి.మాడుగుల ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో పట్టుబడ్డాడు. అతడి నుంచి 440 కిలోల గంజాయి, ఒక బొలేరో వ్యాన్‌(ఏపీ31 టీసీ 700) అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి వాదోపవాదనలు అనంతరం చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎం. హరినారాయణ బుధవారం తీర్చునిచ్చారు. పక్కా ఆధారాలతో పట్టుకుని చార్జ్‌ షీట్‌ దాఖలు చేసిన అప్పటి ఇన్‌స్పెక్టర్లు పి.శ్రీనివాసరావు, టి.నాగేశ్వరరావు వారి సిబ్బందితో పాటు ఫోరెన్సిక్‌ రిపోర్టులు, సాక్ష్యాధారాలను కోర్టులో సమర్థవంతంగా ప్రవేశపెట్టిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సిహెచ్‌.సూర్యనారాయణ, ప్రస్తుత వి.మాడుగుల ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.ఉపేంద్ర, కోర్టు మోనిటరింగ్‌ సెల్‌ సిబ్బందిని ఎకై ్సజ్‌ అధికారి సుధీర్‌ అభినందించారు. గంజాయి సాగు, విక్రయం, రవాణా వంటి చర్యలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రజలందరూ డిపార్ట్‌మెంట్‌కు సహకరించాలని కోరారు. పాత కేసుల్లో కూడా నిందితులకు శిక్షలు పడేలా నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement