గిరిజన రైతులకు రుణాలు
ముంచంగిపుట్టు: గిరిజన రైతులకు ధరి ఆభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభిమాన్ పథకం ద్వారా రుణాలు కల్పన కోసం చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకులు ఎన్.కిషోర్ అన్నారు.మండల కేంద్రంలో స్థానిక పశు వైద్యశాలలో ఏడీ కిషోర్ ఆధ్వర్యంలో పశువైద్యాధికారులు, సిబ్బందితో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న పశు వైద్య శిబిరాలు, టీకాల కార్యక్రమాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఏడీ కిషోర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ధరి ఆభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియన్ పథకం ద్వారా ముంచంగిపుట్టు,పెదబయలు మండలాల్లో సుమారు 2వేల మంది గిరిజన రైతులను రుణాలు కల్పన కోసం గుర్తించామన్నారు. ఇందులో భాగంగా లక్ష రూపాయాలకు 90శాతం సబ్సిడీతో రుణం అందించనన్నట్టు తెలపారు.గ్రామ సభల ద్వారా రుణాలు మంజూరై కోసం అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా అటవీ హక్కుల పట్టాలు ఉన్న గిరిజన రైతులకు మాత్రమే రుణాల కల్పన కోపం ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. కిలగాడ, ముంచంగిపుట్టు, జోలాపుట్టు వైద్యశాలల పరిధిలో గ్రామాల్లో టీకాల కార్యక్రమం నిర్వహణపై సిబ్బందికి ఆదేశించామన్నారు. పశువైద్యాధికారి రవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


