సన్‌ఫ్లవర్ ఫుల్ ఆదాయం
ఏజెన్సీలోని పొద్దు తిరుగుడు సాగు చేపట్టిన రైతులకు పర్యాటకుల రాకతో అదనపు ఆదాయం సమకూరుతోంది. ఈ ప్రాంతానికి వచ్చే సందర్శకులు పొద్దుతిరుగుడు తోటలను సందర్శిస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు ఒక వ్యక్తి ఫొటోలు తీసుకునేందుకు రూ.20 తీసుకుంటున్నారు. డుంబ్రిగుడ–అరకులోయ జాతీయ రహదారిలో నారింజవలస జంక్షన్ వద్ద పొద్దుతిరుగుడు సాగు చేపట్టిన గిరిజన యువ రైతు వంతాల కొండబాబు ఏటా మంచి ఆదాయం పొందుతున్నారు. మూడు సెంట్లలో చేపట్టిన ఈ పైరులో సుమారు 15 రోజులపాటు పూత దశ ఉంటుంది. పర్యాటకుల రాకవల్ల రోజుకు రూ.2 వేల వరకు ఆదాయం వస్తోందని ఆయన తెలిపారు. – సాక్షి,పాడేరు


