నిండుగా డొంకరాయి జలాశయం
మోతుగూడెం: డొంకరాయి జలాశయ నీటిమట్టం పెరుగుతుండటంతో రెండు గేట్ల ద్వారా మూడువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో ఐదారు యూనిట్ల నిర్మాణం వల్ల సుమారు రెండు నెలలు పాటు జలవిద్యుత్ కేంద్రం మూసివేశారు. దీంతో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం డొంకరాయి జలాశయానికి చేరుతున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని జెన్‌కో అధికారులు తెలిపారు.
● డొంకరాయి జలవిద్యుత్ కేంద్రం పూర్తిస్థాయి నీటి మట్టం 1037 అడుగులు. ప్రస్తుతం 1036 అడుగులకు చేరడంతో పైనుంచి వచ్చిన నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం ఐదారు యూనిట్ల నిర్మాణంలో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం తెలిసిందే. దీనిలో భాగంగా డొంకరాయి నుంచి ఫోర్‌బే జలాశయం వరకు సుమారు తొమ్మిది కిలోమీటర్ల మేర పవర్ కెనాల్‌కు మరమ్మతు పనులు చేపట్టారు. సుమారు రూ. 2కోట్లతో పవర్ కెనాల్‌కు సైడ్ వాల్వుల ప్లాస్టరింగ్, కెనాల్ దిగువ భాగాన కాంక్రీట్, గ్రౌటింగ్ పనులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు.
● పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం ఐదారు యూనిట్లు నిర్మాణంలో భాగంగా పవర్‌హౌస్ దిగువ భాగాన ఉన్న ట్రయల్ రేస్ సంపూ (నీటి ట్యాంక్) నీటిని వారం రోజులుగా కెనాల్‌కు అడ్డంగా మట్టికట్టను ఏర్పాటు చేసి దిగువకు విడుదల చేస్తున్నారు. పవర్ హౌస్ దిగువ భాగాన ఐదారు యూనిట్లకు నూతన గేట్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నీటిని పంపుల ద్వారా తోడి దిగువకు పంపిస్తున్నారు. అనంతరం ఐదారు యూనిట్లు గేట్ల వద్ద గతంలో నీరు లోపలి భాగానికి వెళ్లకుండా కాంక్రీట్‌తో కప్పేశారు. నీటిని తోడిన వెంటనే కాంక్రీట్‌ను తొలగించి కొత్త గేట్లను ఏర్పాటు చేసే పనుల్లో జెన్‌కో అధికారులు నిమగ్నమయ్యారు.
1036 అడుగులకు చేరిన నీటిమట్టం
దిగువకు మూడు వేల
క్యూసెక్కులు విడుదల
పవర్ కెనాల్‌కు చురుగ్గా
మరమ్మతు పనులు
5,6 యూనిట్లకు కొత్త గేట్ల ఏర్పాటు పనుల్లో జెన్‌కో అధికారులు
నిండుగా డొంకరాయి జలాశయం
నిండుగా డొంకరాయి జలాశయం


